నిశ్శబ్ధం మరింత ముందుకు?

October 09, 2020 05:53: AM

అనుష్క-మాధవన్ ల పీపుల్స్ మీడియా సినిమా అమెజాన్ ప్రయిమ్ కు ఇవ్వడం అన్నది దాదాపు ఖాయం అయిపోయింది. అగ్రిమెంట్లు ఇవ్వాళో, రేపో అన్నట్లుంది వ్యవహారం. ముందుగా ఈ సినిమాను అక్టోబర్ రెండు లేదా మూడో వారంలో వేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు మళ్లీ ఆ ఆలోచన మారినట్లు తెలుస్తోంది.

అనుకున్నదాని కన్నా ఓ వారం ముందుగానే అంటే అక్టోబర్ 2 కే రావాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇదే డేట్ కు మరో ఓటిటి ప్లాట్ ఫారమ్ మీద రాజ్ తరుణ్ ఒరేయ్ బుజ్జిగా విడుదలకు రెడీ అవుతోంది. అంటే థియేటర్లలోనే కాదు, ఓటిటి లో కూడా సినిమాలు పోటీ పడే రోజులు వచ్చాయన్న మాట.

ముందుగా నిశ్శబ్దం చూడాలా? ఒరేయ్ బుజ్జిగా చూడాలా? అని అనుకుంటే థ్రిల్లర్ కాబట్టి ఓటిటి ప్రేక్షకులు నిశ్శబ్దానికే ఓటు వేస్తారేమో? పైగా నిశ్శబ్దం అమెజాన్ ప్రయిమ్ లో విడుదలవుతోంది. దీనివల్ల ఓవర్ సీస్ ఆడియన్స్ ఎక్కువగా చూడడానికి అవకాశం వుంది.