నివేథా..కామెడీ థ్రిల్లర్


ఈ మధ్యనే కాస్త వినిపిస్తున్న పేరు నివేథా పేతురాజ్. ఈ అమ్మాయి హీరోయిన్ గా ఓ చిన్న కామెడీ థ్రిల్లర్ ను ఓటిటి కోసం రెడీ చేస్తున్నారు పీపుల్స్ మీడియా నిర్మాతలు. ఇరవై రోజుల్లో పూర్తయిపోయే చిన్న సినిమా ఇది. కేవలం ఓటిటి కోసం తయారుచేస్తున్న ఈ సినిమాకు దర్శకుడు ఎవరో కాదు. సవ్యసాచి తరువాత దాదాపు రెండేళ్లుగా ఖాళీగా వుండిపోయిన దర్శకుడు చందు మొండేటి.

కార్తికేయ 2 స్క్రిప్ట్ రెడీ అయి అలా వుంది. ఆ భారీ బడ్జెట్ సినిమాను ఎప్పుడు స్టార్ట్ చేస్తారో అన్నది ఇంకా క్లారిటీ లేదు. ఎందుకంటే దాని బడ్జెట్, దాని వ్యవహారం వేరు. విదేశాల్లో షూటింగ్ లాంటి వ్యవహారాలు వున్నాయి. కానీ ఆ బడ్జెట్ ను ఆ సినిమా వెనక్కు ఇవ్వగలదా అన్న చిన్న అనుమానం కూడా వుంది.

ఇలాంటి నేపథ్యంలో అదే బ్యానర్ లో ఓ చిన్న సినిమాను లాగించేయాలని ప్లాన్ చేసారు. అదే ఈ రోజు ఆర్ ఎఫ్ సి లో పూజ జరుపుకుని,  షూటింగ్ ప్రారంభమైంది. ఎకాయెకిన షూట్ పూర్తి చేస్తారు.