ఎన్టీఆర్ తో గేమ్స్ ఆడుతున్నారా?

October 09, 2020 06:52: AM

పెద్ద డైరక్టర్లకు చాన్స్ లు వుండడం విశేషం కాదు. అందులోనూ హిట్ మీద వున్న డైరక్టర్లకు ఈజీగా చాన్స్ లు వుంటాయి. త్రివిక్రమ్ ఇప్పుడు అలాంటి ప్లేస్ లో వున్నారు. ఏ టాప్ హీరో అయినా పిలిచి సినిమా చేస్తారు. కానీ సమస్య ఏమిటంటే అల వైకుంఠపురములో సినిమా తరువాత త్రివిక్రమ్ పోయి పోయి ఎన్టీఆర్ తో సినిమా చేయాలనుకున్నారు. అక్కడ ఆర్ఆర్ఆర్ వుందనీ, దాని వ్యవహారం అంతా పూర్తిగా అన్ సర్టిన్ గా వుంటుందని తెలిసి మరీ అటు వెళ్లారు.

ఇప్పుడేమయింది. కరోనా వచ్చి పడింది. మరో ఆరేడు నెలలకు కానీ ఎన్టీఆర్ వచ్చే పరిస్థితిలో లేరు. ఎన్టీఆర్ తనంతట తాను ఓ సినిమా చేసుకురండి త్రివిక్రమ్ ని చెబితే బాగుండును అని హారిక హాసిని ఆలోచన. వాళ్లు అడిగితే అప్పుడు చూద్దాం అనేది ఎన్టీఆర్ ఆలోచన. ఇలాంటి నేపథ్యంలో ఎన్టీఆర్ ను కాస్త ప్రెజర్ చేసి, విషయం ముందుకు కదిపించాలని హారిక హాసిని లేదా త్రివిక్రమ్ చూస్తున్నట్లు కనిపిస్తోంది.

అందుకే మహేష్ బాబును కలిసారు. రామ్ చరణ్ తో మాట్లాడారు. ఇలాంటి ఫీలర్లు అన్నీ బయటకు వస్తున్నాయి. ఇవన్నీ ఎన్టీఆర్ ను కదలించేందుకు హారిక హాసిని నుంచే పుడుతున్నాయని ఎన్టీఆర్  టీమ్ లేదా ఫ్యాన్స్ లో వినిపిస్తున్న సంగతి. ఇలాంటి వార్తలు అన్నీ వస్తే ఎన్టీఆర్ నే పిలిచి, ఓ చిన్న సినిమా చేసుకురండి అంటాడేమో అన్నది హారిక హాసిని ఆశ అంటూ గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి.

కానీ ఎన్టీఆర్ తక్కువ తినలేదు. అందుకే గమ్మున వున్నారు. ప్రస్తుతానికి త్రివిక్రమ్ డైలాగ్ వెర్షన్ మీద తరచు ఎన్టీఆర్ తో డిస్కషన్లు సాగిస్తున్నారు. ఏ మాత్రం అవకాశం వున్నా వెంకటేష్ తో ఓ సినిమా చేసేయాలని ఆయన కోరిక. అది అలా మనసులోనే వుంటుంది. ఎన్టీఆర్ దాకా చేరడానికి ఇలాంటి ఫీలర్లు బయటకు వస్తుంటాయి.

ఇదిలా వుంటే ‘వాళ్ల వాళ్ల స్ట్రాటజీల కోసం మన పేరు వాడుకుంటున్నారు’ అన్నది మహేష్ బాబు టీమ్ కామెంట్ గా తెలుస్తోంది.