‘వి’ సినిమా 2020 సెప్టెంబర్ 5న విడుదల.


టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న మల్టీ స్టారర్‌ యాక్షన్ మూవీ ‘ వి’ విడుదల గురించి స్పష్టత వచ్చింది. ఈ ఏడాది మార్చిలోనే విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనావైరస్ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ ‘ వి’ చిత్రంపై ఐదు నెలలుగా ఎన్నో ఊహగానాలు వినిపించాయి. తాజాగా వాటన్నింటికీ చెక్ పెట్టారు హీరో నాని. సెప్టెంబరు 5న ఈ చిత్రం ఓటీటీ ద్వారా అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానున్నట్లు నాని ప్రకటించారు. ‘‘పన్నేండుళ్లుగా మీరు నన్ను చూడటానికి థియేటర్లకు వస్తున్నారు.. ఈ సారి మాత్రం నేనే మీ ఇంటికి వస్తున్నా అంటూ ఓ లేఖను ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు. ఇప్పుడు ‘వి’ వేట.. థియేటర్స్ ఓపెన్ అయిన తర్వాత ‘టక్ జగదీష్’ ఆట ప్రామిస్ అంటూ దానిలో రాశారు.